తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్​ హత్య కేసులో మరో ట్విస్ట్​

Driver Subrahmaniam murder case: ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హత్య జరిగిన అపార్ట్​మెంట్​ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో అక్కడ గొడవ జరిగినట్లు ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. మరోవైపు అక్కడ పని చేస్తున్న వాచ్​మెన్ సైతం​ అపార్ట్​మెంట్​ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో డ్రైవర్​ హత్య కేసు మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్​ హత్య కేసులో మరో ట్విస్ట్​
ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్​ హత్య కేసులో మరో ట్విస్ట్​

By

Published : May 24, 2022, 3:33 PM IST

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్​ హత్య కేసులో మరో ట్విస్ట్​

Driver Subramaniam murder case: ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్ బయటికొచ్చింది. డ్రైవర్​ హత్యకు గురైన అపార్ట్​మెంట్‌ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19న రాత్రి 10.30 సమయంలో అపార్ట్​మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం.. గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడం వల్లే చనిపోయాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటలకు అనంతబాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. మళ్లీ ఒంటిగంటకు తిరిగి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీల్లో ఉంది.

మరోవైపు సుబ్రహ్మణ్యం మృతి చెందాడని చెబుతున్న అపార్ట్​మెంట్​ వద్ద వాచ్​మెన్​గా పని చేస్తున్న శ్రీను.. అసలు గొడవే జరగలేదని చెబుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనంతబాబు మూడో అంతస్తులో ఉండేవారని అపార్ట్​మెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను తెలిపారు. చనిపోయిన సుబ్రహ్మణ్యానికి తాను బాబాయి అవుతానని చెప్పారు. పుట్టినరోజు వేడుకలు అపార్ట్​మెంట్​ వద్ద జరగలేదని స్పష్టం చేశారు. ఎస్పీ చెప్పినట్టు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదని.. ప్రమాదంలో చనిపోయాడని సుబ్రహ్మణ్యం తండ్రి నాకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. అదే సమయంలో అనంతబాబు కంగారుగా వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉన్నారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు భార్యతో వెళ్లి అర్ధరాత్రి వచ్చారని చెప్పారు. పోలీసులు ఎవరూ మా దగ్గరకు రాలేదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను స్పష్టం చేశారు.
సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details