ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్మోహన్రెడ్డిని తన కుమారుడితో సహా.. నేడు కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారని సమాచారం.
ఆ ఎమ్మెల్యే కుమారుడికి సీఎం వైకాపా పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారని... అనంతరం.. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ఆ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మీడియా ప్రతినిధులు.. ఆయనను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.