రైతు బంధు పథకానికి ఆర్థిక శాఖ మరో రూ.208కోట్లు విడుదల చేసింది. 2020-21 బడ్జెట్లో రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం 15225.42 కోట్లు కేటాయించగా... ఆర్థిక శాఖ అందులో ఇప్పటి వరకు 14592.13 కోట్లు విడుదల చేసింది. యాసంగి సీజన్ సాయం కోసం శనివారం వరకు 7160.50 కోట్లను వ్యవసాయశాఖ రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రైతుబంధు పథకానికి మరో 208 కోట్లు విడుదల - telangana varthalu
రైతుబంధు పథకానికి ఆర్థిక శాఖ మరో రూ.208 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
రైతుబంధు పథకానికి మరో 208కోట్లు విడుదల
తాజాగా ఆర్థికశాఖ మరోమారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో మరో 425.03 కోట్ల నిధులు మిగిలాయి.
ఇదీ చూడండి: 'మిషన్ భగీరథకు అభినందనలే కాదు నిధులూ ఇవ్వాలి'