తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో మరో ఐటీ సెజ్​కు అనుమతి - హైదరాబాద్ ఐటీ వార్తలు

రాష్ట్రంలో మరో ఐటీ సెజ్‌ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22 ఐటీ, దాని అనుబంధ సెజ్‌లు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. తాజాగా సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ ఐటీ సెజ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్రం అన్ని కోణాల్లో పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకొని అనుమతి ఇచ్చింది.

it sez
it sez

By

Published : Jan 18, 2021, 6:41 AM IST

తెలంగాణలో మరో ఐటీ, దాని అనుబంధ కార్యకలాపాల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో రూ.823 కోట్లతో 3.6 ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటు కోసం సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ అనే సంస్థకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అనుమతుల మండలి (బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్‌) ఆమోదం తెలిపింది.

టిఫికేషన్‌ వెలువడిన తర్వాతే రాయితీలు

2,13,125 చదరపు మీటర్ల నిర్మాణ స్థలంలో సెజ్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 17,500 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనికి సెజ్‌ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయగా ఇటీవల దిల్లీలో జరిగిన బీవోఏ సమావేశంలో అనుమతులు లభించాయి. ఈ సెజ్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది.

రాష్ట్రంలో 22 ఐటీ సెజ్‌లు

రాష్ట్రంలో ప్రస్తుతం 22 ఐటీ, దాని అనుబంధ సెజ్‌లు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మరో 19 సెజ్‌లకు కేంద్రం అనుమతులు ఇచ్చినా అవి నడవడం లేదు. అవి అశక్తతను వ్యక్తం చేయడంతో వాటి అనుమతులు రద్దయ్యాయి. తాజాగా సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ ఐటీ సెజ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్రం అన్ని కోణాల్లో పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకొని అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి :'కొవిడ్‌ టీకాల పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు'

ABOUT THE AUTHOR

...view details