ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం..! - another depression in telangana
ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం..!
రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 23న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీభారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..