తెలంగాణ

telangana

ETV Bharat / city

NTR BHAVAN-TDP OFFICE: తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్ - Six more arrested tdp attack case

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో(attack on tdp office case news) మరో ఆరుగురు అరెస్టు అయ్యారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్న పోలీసులు.. మిగతా వారికోసం 4 బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు.

NTR BHAVAN-TDP OFFICE
తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్

By

Published : Oct 24, 2021, 7:01 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి మరో అరుగురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు(attack on tdp office case news). వీరిలో ముగ్గురు విజయవాడ వాసులు కాగా... మరో ముగ్గురు గుంటూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా విజయవాడకు చెందిన జోగ రాజు, షేక్ బాబు, షేక్ సైదా, బంక సూర్యసురేష్, గుంటూరుకు చెందిన మోహన్ కృష్ణారెడ్డి, కాండ్రుకుంట గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముద్దాయిలను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. వీడియో క్లిప్పింగుల ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు చేపట్టారు.

నిన్న పది మంది అరెస్ట్..

రాష్ట్రంలో సంచలనం రేపిన తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు శనివారం పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుచరులు, విజయవాడకు చెందిన మరో వైకాపా నేత దేవినేని అవినాష్‌ సన్నిహితులని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా తాము వీరిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆ పది మంది వీరే..
పానుగంటి చైతన్య, పల్లపు మహేష్‌ బాబు, పేరూరి అజయ్‌, శేషగిరి పవన్‌కుమార్‌, అడపాల గణపతి, గోక దుర్గాప్రసాద్‌ (గుంటూరు జిల్లా), షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, లంక అభినాయుడు, జోగ రమణ (విజయవాడ). ఇదే కేసులో జ్యోతిరాజా, షేక్‌సైదా, షేక్‌ బాబు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో వీరు పాల్గొన్నట్లు సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీటీవీ పుటేజి ఇవ్వాల్సిందిగా తెదేపా కార్యాలయానికి 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశామని, అది రాగానే మిగిలినవారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి.. వీరిని రిమాండ్‌కు ఇవ్వాలని కోరలేదని, నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని సూచించి పంపామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ ‘ఈనాడు’కు వివరించారు. ఆ రోజు జరిగిన విధ్వంసంలో వీరి పాత్ర గురించి సీసీటీవీ పుటేజిని విశ్లేషించాల్సి ఉందని.. ఆ తర్వాతే రిమాండ్‌కు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొందరి నేపథ్యంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలివీ...

  • గుంటూరుకు చెందిన పానుగంటి చైతన్య లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు. అప్పిరెడ్డి ప్రజాప్రతినిధి అనిపించుకునే వరకు తాను గడ్డం, మీసాలు తీసేది లేదనేవారు. ఎమ్మెల్సీ పదవి రాగానే తిరుపతి వెళ్లి మొక్కుతీర్చుకున్నారు. ఆయన సభలు, సమావేశాలకు జనసమీకరణ చేయటం వంటి బాధ్యతలు చూస్తారు. గుంటూరు కన్యకాపరమేశ్వరి ఆలయ పాలకమండలి సభ్యుడు. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
  • పల్లపు మహేష్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌. ఈయనా అప్పిరెడ్డి వెన్నంటే ఉంటారు.
  • శేషగిరి పవన్‌ కూడా అప్పిరెడ్డికి వీరాభిమాని. ఆయన ఎమ్మెల్సీ కాగానే గుంటూరు నుంచి కాలినడకన దుర్గగుడికి వెళ్లి తలనీలాలు ఇచ్చి అభిమానం చాటుకున్నారు.

70 మందిపై కేసు..!

తెదేపా కార్యాలయం(attack on tdp office)పై దాడి ఘటనలో.. వైకాపాకు చెందిన 70 మంది కార్యకర్తలపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి.. రిసెప్షన్ కమిటీ చైర్మన్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా.. ఈ కార్యాలయంలో తనపై జరిగిన దాడి గురించి, కార్యాలయ సిబ్బంది బద్రి ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. బద్రి తల పగలగొట్టినప్పటికీ.. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని తెదేపా నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండి

arrest: తెదేపా కార్యాలయంపై దాడి కేసు.. నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details