ఏపీలో మరో 5,041 కరోనా పాజిటివ్ కేసులు, 56 మంది మృతి - 5041 new corona cases recorded in ap
13:45 July 19
ఏపీలో మరో 5,041 కరోనా పాజిటివ్ కేసులు, 56 మంది మృతి
ఏపీలో కొత్తగా 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మెుత్తం కేసుల సంఖ్య 49,650కి చేరింది. వైరస్ కారణంగా తాజాగా మరో 56 మంది మృతి చెందగా.. మెుత్తం మరణాలు 642కు చేరుకున్నాయి. ప్రస్తుతం 26,118 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ వైరస్ నుంచి 22,890 కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 31,148 నమూనాలు పరీక్ష చేయగా.. మెుత్తం 13.15 లక్షల మందికి కరోనా పరీక్షలు జరిగాయి.
కరోనాతో తూర్పు గోదావరి జిల్లా 10, శ్రీకాకుళం జిల్లాలో 8, కర్నూలు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో నలుగురు, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాకు బలి అవ్వగా.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చూడండి :గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం