రాష్ట్రంలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం.. 1,13,007 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,052 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 406 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,32,581కి చేరింది.
రాష్ట్రంలో మరో 3,052 కరోనా కేసులు, 7 మరణాలు - covid impact in telangana
09:17 April 13
రాష్ట్రంలో మరో 3,052 కరోనా కేసులు, 7 మరణాలు
కొవిడ్ కోరల్లో చిక్కి మరో ఏడుగురు మరణించగా.. ఇప్పటి వరకు 1,772 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి తాజాగా మరో 778 మంది బాధితులు కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 16,118 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో అత్యధికులు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. సుమారు 43 శాతం కేసులు ఈ వయసువారే ఉండటం ఆందోళనకలిగిస్తోంది.
జిల్లాల వారీగా కేసులు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 406, ఆదిలాబాద్ 98, భద్రాద్రి కొత్తగూడెం 44, జగిత్యాల 135, జనగామ 32, జయశంకర్ భూపాలపల్లి 14, కామారెడ్డి 111, కరీంనగర్ 87, ఖమ్మం 95, కుమురం భీం ఆసిఫాబాద్ 27, మహబూబ్నగర్ 97, మహబూబాబాద్ 18, మంచిర్యాల 78, మెదక్ 23, మేడ్చల్ మల్కాజిగిరి 301, ములుగు 12, నాగర్కర్నూల్ 52, నల్గొండ 109, నారాయణపేట 12, నిర్మల్ 113, నిజామాబాద్ 279, పెద్దపల్లి 49, సిరిసిల్ల 61, రంగారెడ్డి 248, సంగారెడ్డి 123, సిద్దిపేట 79, సూర్యాపేట 63, వికారాబాద్ 61, వనపర్తి 50, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 84, యాదాద్రి భువనగిరిలో 53 కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:కరోనా విలయం: ఒక్క రోజులో 1,61,736 కేసులు