రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,157 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గత వారం రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. అది కేవలం నిర్ధారణ పరీక్షలు తగ్గటమే కారణమన్న విషయాన్ని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గడచిన వారం రోజులుగా నిత్యం 90 వేల నుంచి లక్షకు పైగా టెస్టులు చేస్తుండగా మంగళవారం ఉగాది కావడం వల్ల పరీక్షల సంఖ్య 72 వేలకే పరిమితం అయ్యింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 1,12,53,374కి చేరింది.
మొత్తం మరణాలు 1780..
తాజాగా వచ్చిన పాజిటివ్ వచ్చిన కేసులతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,34,738 మంది కొవిడ్ బారిన పడ్డారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా మరో 821 మంది కోలుకోగా... ఇప్పటి వరకు బయటపడిన వారి సంఖ్య 3,07,499కి చేరింది. కొవిడ్ కోరల్లో చిక్కుకొని 8 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1780కి చేరింది. రాష్ట్రంలో 25,459 యాక్టివ్ కేసులున్నాయి. అందులో 16,892 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా..
జీహెచ్ఎంసీ 361, ఆదిలాబాద్ 65, భద్రాద్రి కొత్తగూడెం 24, జగిత్యాల 107, జనగామ 12, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులాంబ గద్వాల 13, కామారెడ్డి 57, కరీంనగర్ 74, ఖమ్మం 59, కుమరంభీం ఆసిఫాబాద్ 13, మహబూబ్నగర్ 68, మహబూబాబాద్ 8, మంచిర్యాల 51, మెదక్ 28, మేడ్చల్ మల్కాజిగిరి 245, ములుగు 4, నాగర్కర్నూల్ 27, నల్గొండ 68, నారాయణపేట 11, నిర్మల్ 31, నిజామాబాద్ 187, పెద్దపల్లి 21, రాజన్న సిరిసిల్ల 31, రంగారెడ్డి 206, సంగారెడ్డి 135, సిద్దిపేట 59, సూర్యాపేట 29, వికారాబాద్ 35, వనపర్తి 21, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 64, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:పర్వదినాల వేళ.. విజృంభిస్తే ఎలా..?