తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు - corona virus update news

ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మెుత్తం మృతుల సంఖ్య 75కి చేరింది.

another-199-corona-positive-cases-in-the-state
ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Jun 7, 2020, 4:22 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 199 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే 69 మంది ఉండగా.. రాష్ట్రంలో 130 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 75కి చేరింది.

ఇప్పటివరకు ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 3,718గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 30 మంది డిశ్చార్జి అయ్యారు. మెుత్తం మీద ఇప్పటివరకు 2,353 మంది డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రుల్లో 1,290 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

ఇవీ చూడండి: చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..

ABOUT THE AUTHOR

...view details