కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా 13,500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఇవ్వనుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు తొలుత 21,500 కేటాయించగా ఇప్పుడు ఆ సంఖ్యను 35వేలకు పెంచినట్లు కేంద్ర రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోటాను 59 వేల నుంచి 60 వేలకు పెంచారు.
తెలంగాణకు మరో 13,500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు - 35 thousand Remde Sivir injections to Telangana
కేంద్ర సర్కార్ తెలంగాణకు అదనంగా 13,500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తొలుత 21,500 కేటాయించగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 35వేలకు పెంచింది. అత్యధికంగా మహారాష్ట్రకు 4,35,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనుంది.
రాష్ట్రానికి రెమ్‌డెసివిర్, తెలంగాణకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు
ఇదివరకు అధిక కేసులున్న 19 రాష్ట్రాలకు కలిపి 11 లక్షలు కేటాయించినట్లు ప్రకటించగా ఇప్పుడు 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 16 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. మహారాష్ట్రకు 2,69,200 నుంచి 4.35 లక్షలకు, గుజరాత్‌కు 1.63 లక్షల నుంచి 1.65 లక్షలకు, ఉత్తర్‌ప్రదేశ్‌కు 1.22 లక్షల నుంచి 1.61 లక్షలకు, దిల్లీకి 62 వేల నుంచి 72 వేలకు కోటా పెంచినట్లు ప్రకటించారు. రాష్ట్రాల అవసరాలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.