ఈ నెల 15 నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పదకొండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఈ నెల 25న ముగియనున్నాయి. ఈసారి కూడా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఇక్కడ నిర్వహించడం ఇది ఐదోసారి కానుంది.
ఈ నెల 15 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు - ఈ నెల 15 నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈసారి కూడా బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఈ నెల 15 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
15 స్వస్తి వాచనం, అంకురారోపణం, 16న ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేద పారాయణ, హావన, అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు... విశేష వేడుకలు 21న మొదలవుతాయి. ఆరోజు ఎదుర్కోలు, 22న స్వామివారి తిరు కల్యాణమహోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం, 24న పూర్ణాహుతి, శృంగార డోలోత్సవం, 25న శత ఘటాభిషేకము, ఉత్సవాలకు పరిసమాప్తి పలికి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:కనుల పండువగా పెద్దగట్టు జాతర