తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandayya Medicine: 'నా పేరుతో నకిలీ మందులు.. వికటిస్తే బాధ్యత నాది కాదు'

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని.. కొందరు తన పేరుపై నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నకిలీ మందు తీసుకుని మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Anandayya Medicine: నా పేరుతో నకిలీ మందులు.. వికటిస్తే బాధ్యత నాది కాదు: ఆనందయ్య
Anandayya Medicine: నా పేరుతో నకిలీ మందులు.. వికటిస్తే బాధ్యత నాది కాదు: ఆనందయ్య

By

Published : Jul 14, 2021, 1:32 PM IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో మందును తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కొందరు తన పేరుపై నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య ఆరోపించారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చిట్టమూరు మండలం మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.

ఆలయ నిర్వాహకులు, అర్చకులు.. ఆనందయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలువురికి కరోనా నివారణ మందు అందజేశారు. అన్ని ప్రాంతాలకూ తన మందు చేరిందని, ఇందుకు సహకరించిన వారందరికీ అనందయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి, సాయిరెడ్డి, పార్ధసారథి రెడ్డి, ప్రధాన అర్చకుడు భానుప్రకాష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Krishna Water: తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

ABOUT THE AUTHOR

...view details