తెలంగాణ

telangana

ETV Bharat / city

పొరుగు రాష్ట్రాల్లో అంకుర ఆస్పత్రుల శాఖలు.. ప్రకటించిన బ్రాండ్​అంబాసిడర్​ సోనూసూద్​ - అంకుర ఆస్పత్రి మరో నాలుగు శాఖలు

Sonu sood in hyderabad: ఏపీ, తెలంగాణల్లో మొత్తం 12 శాఖలతో వైద్య సేవలందిస్తోన్న అంకుర ఆస్పత్రి మరో నాలుగు శాఖలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఆస్పత్రి బ్రాండ్​ అంబాసిడర్​ సోనూసూద్​ ఈ ప్రకటనను వెల్లడించారు.

ankura hospital brand ambassador sonu sood announced about branches in neighbor states
ankura hospital brand ambassador sonu sood announced about branches in neighbor states

By

Published : Apr 20, 2022, 7:04 PM IST

Sonu sood in hyderabad: మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సలో తనదైన ముద్రవేసిన అంకుర ఆస్పత్రి త్వరలో మరో నాలుగు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నగరంలోని ఓ ప్రముఖ హోటల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నటుడు, అంకుర ఆస్పత్రి బ్రాండ్ అంబాసిడర్ సోనూసూద్, ఆస్పత్రి ఎండీ డాక్టర్ కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఏపీ, తెలంగాణల్లో మొత్తం 12 శాఖలతో అంకుర ఆస్పత్రి దిగ్విజంగా ముందుకు సాగుతోందని ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే త్వరలో మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలో తమ శాఖలను విస్తరించనన్నట్టు ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న సోనూసూద్​.. కొవిడ్​ సమయంలో అంకుర ఆస్పత్రితో ఏర్పడ్డ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సేవ చేయటానికి మించిన తృప్తి లేదని వివరించారు.

"కొవిడ్​ సమయంలో అంకుర ఆస్పత్రితో అనుబంధం ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఆస్పత్రులను నేను సందర్శించాను. అంకుర ఆస్పత్రి కూడా కొవిడ్​ సమయంలో గొప్ప సేవలు అందించింది. ఒక చిన్నారికి చికిత్స అందించాల్సిన పరిస్థితుల్లో అంకుర ఆస్పత్రి ముందుకొచ్చింది. సమాజానికి మంచి చేద్దామన్న ఆలోచన.. నాణ్యమైన చికిత్స అందించాలన్న సంకల్పం.. నన్ను ఆకర్షించింది. ఆరోజు నుంచి అంకుర ఆస్పత్రులతో నాకు సంబంధం ఏర్పడింది. గర్భిణీలకు, పిల్లలకు అంకుర ఆస్పత్రులు ఎంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాయి." -సోనూసూద్​, అంకుర ఆస్పత్రుల బ్రాండ్​ అంబాసిడర్​

పొరుగు రాష్ట్రాల్లో అంకుర ఆస్పత్రుల శాఖలు.. ప్రకటించిన బ్రాండ్​అంబాసిడర్​ సోనూసూద్​

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details