ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గొర్లగడ్డలో ఉన్న శ్రీకృష్టుని ఆలయం ఆవరణలో జంతు బలి వ్యవహారం కలకలం సృష్టించింది. మాంసం ముద్దలను ఆలయం ఎదురుగా గమనించిన స్థానికులు.. ఆందోళన చెందారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు జంతువును బలి ఇచ్చి మాంసం ముద్దలను అక్కడ పడేశారు. జంతు రక్తాన్ని కల్యాణ మండపం చుట్టూ చల్లిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
శ్రీకృష్టుడి ఆలయ ఆవరణలో జంతుబలి కలకలం - దర్శి కృష్ణ ఆలయం తాజా వార్తలు
ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయం ఆవరణలో అపచారం జరిగింది. దర్శి మండలం పడమటి బజార్‌లో ఉన్న గుడి దగ్గర రక్తం మరకలు, మాంసపు ముక్కలు కనిపించడం కలకలం సృష్టించింది.
శ్రీకృష్టుడి ఆలయ ఆవరణలో జంతుబలి కలకలం
ఉదయాన్నే స్థానికులు ఈ దృశ్యాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్శి సీఐ మహమ్మద్ మొయిన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న ఒంగోలు తెదేపా నేత నూకసాని బాలాజీ, పమిడి రమేశ్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.