తెలంగాణ

telangana

ETV Bharat / city

పచ్చిపాలతో ప్రమాదం.. బ్రసెల్లోసిస్ వ్యాధి వచ్చే అవకాశం! - పచ్చిపాలు తాగొద్దని పశుసంవర్థక శాఖ సూచన

పచ్చి పాలు తాగడం వల్ల పశువులకు సోకే బ్రుసెల్లోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. కాచి చల్లార్చిన తర్వాతే పాలు తాగాలని సూచించింది.

animal husbandry department suggest to drink heated only
పచ్చిపాలతో ప్రమాదం.. బ్రసెల్లోసిస్ వ్యాధి వచ్చే అవకాశం!

By

Published : Dec 28, 2020, 8:30 AM IST

పచ్చి పాలను తాగరాదని, కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని పశుసంవర్థక శాఖ సూచించింది. పశువులకు సోకే బ్రుసెల్లోసిస్‌ వ్యాధి... పచ్చి పాలను తాగడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని వెల్లడించింది. పాడి రైతులు, పశువుల వద్ద పనిచేసేవారికి ఈ వ్యాధి సోకడానికి అవకాశాలున్నాయని, వాటి దగ్గరకు తప్పనిసరిగా మాస్కులు కట్టుకొని, బూట్లు వేసుకుని వెళ్లాలని తెలిపింది.

శరీరంపై గాయాలుంటే పశువుల దగ్గరకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. మరోపక్క 4 నుంచి 8 నెలల వయసున్న అన్ని రకాల ఆడ దూడలకు ఈ నెల 28 నుంచి ఆరు రోజుల పాటు బ్రుసెల్లోసిస్‌ వ్యాధి నిరోధక టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. మండల పశువైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రతి గ్రామానికి వెళ్లి ఈ టీకాలు అందిస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:నేటి నుంచి రైతుబంధు... నియంత్రిత సాగుపై కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details