తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంట్లోకి కుక్క వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు - Hyderabad Crime updates

భాగ్యనగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సరూర్ నగర్​లో ఓవ్యక్తి... పెంపుడు కుక్కను ఎయిర్ గన్​తో కాల్చాడం వల్ల చనిపోయింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. కుక్క యజమాని ఫిర్యాదుతో.. అవినాష్​ను పోలీసులు అరెస్టు చేశారు.

"Angry that the dog got into the house .. shot with the gun."
"కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు"

By

Published : Dec 22, 2019, 7:19 PM IST


హైదరాబాద్ సరూర్ నగర్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి... పెంపుడు కుక్కను ఎయిర్ గన్​తో కాల్చాడు. ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అరెస్టు

గన్​తో కాల్చిన వ్యక్తి అవినాష్​గా గుర్తించారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్​ బ్యాంకులో మేనేజర్​గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిసారి కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో... ఎయిర్ గన్​తో కాల్చినట్లు సమాచారం. కుక్క యజమాని రాజు ఇచ్చిన ఫిర్యాదుతో.. అవినాష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది బషీర్​బాగ్​లో రూ.18వేలకు ఎయిర్ గన్​ కొనుగోలు చేసినట్లు సీఐ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు.

"కుక్క ఇంట్లోకి వస్తుందన్న కోపంతో.. గన్​తో కాల్చాడు"

ఇవీ చూడండి: మహిళతో సంబంధం... కొట్టి చంపిన ఆమె కుటుంబ సభ్యులు

ABOUT THE AUTHOR

...view details