Angel Fish: అరుదైన చేప ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. ఏంజెల్ అనే ఈ చేపను స్థానికులు ‘సానిపాప’గా పిలుస్తారు. అడుగు పొడవున్న చేపను స్థానిక మార్కెట్లో రూ.200లకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇవి సముద్రం అడుగున రాళ్ల మధ్య తిరుగుతూ.. అరుదుగా ఉపరితలానికి వస్తుంటాయి.
ఆ సమయంలో వలలకు చిక్కుతాయి. చూడటానికి అందంగా ఉన్నా.. రుచి తక్కువగా ఉండటంతో ఎక్కువమంది కొనేందుకు ఇష్టపడరు. సాధారణంగా ఇవి 5 కిలోల వరకు పెరుగుతాయని, ప్రోమోకాట్స్ వీటి శాస్త్రీయనామం అని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తెలిపారు.