తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్ని పనులకు మేం కావాలి.. జీతాలు మాత్రం ఇవ్వరా...! - hyderabad latest news

యూసఫ్​గూడలోని స్త్రీ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్ వాడి వర్కర్లు ధర్నాకు దిగారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

anganwadi's dharna
అంగన్ వాడి వర్కర్లు ధర్నా

By

Published : Mar 3, 2020, 4:47 PM IST

తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ హైదరాబాద్ యూసఫ్​గూడలోని స్త్రీ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్ వాడి వర్కర్లు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్ వాడి వర్కర్లు పనిచేస్తున్నారని.. 16 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనాన్ని ఇవ్వకుండా తమని ఇబ్బంది పెడుతున్నారని అంగన్ వాడి వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని నెలలుగా అద్దె బకాయిలు, బిల్లులు సరిగ్గా రావడంలేదని వాపోయారు. ఏ కార్యక్రమం జరిగినా తమని వాడుకుంటున్నారు కానీ శ్రమకు తగ్గ జీతం ఇవ్వట్లేదని మండిపడ్డారు.

అంగన్ వాడి వర్కర్లు ధర్నా

ఇవీ చూడండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ

ABOUT THE AUTHOR

...view details