తెలంగాణ

telangana

ETV Bharat / city

పోతిరెడ్డిపాడుపై త్వరలోనే కృష్టా బోర్డుకు వివరణ

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో పాటు కాలువల సామర్థ్యం పెంచుతూ చేపట్టనున్న పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన వాదనను త్వరలోనే కృష్ణా బోర్డు ముందుంచనున్నట్లు సమాచారం. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీని వివరణ కోరిన విషయం తెలిసిందే.

andhrapradesh-govt
పోతిరెడ్డిపాడుపై త్వరలోనే కృష్టా బోర్డుకు వివరణ

By

Published : May 18, 2020, 11:07 AM IST

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, కాలువల సామర్థ్యం పెంచుతూ చేపట్టనున్న పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన వాదనను త్వరలో కృష్ణా బోర్డు ముందుంచనుందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. వారు ఆంధ్రప్రదేశ్‌ వివరణ కోరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కృష్ణా బోర్డుకు సమాధానమిచ్చేందుకు వీలుగా లేఖలు సిద్ధం చేశారు. ఆ లేఖలు పంపాలా? లేదా అధికారుల బృందం వెళ్లి కృష్ణా బోర్డు పెద్దలను కలిసి వాదనలు వినిపించాలా? అనే విషయంలో చర్చిస్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయిలోనూ ఈ అంశంపై తర్జనభర్జనలు కొనసాగాయి. సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details