ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలకు (Tenth results) మరో వారం సమయం పట్టనుంది. అంతర్గత పరీక్షల మార్కుల (Tenth marks) వివరాల సేకరణలో జాప్యం జరగడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. మార్కుల సేకరణ అనంతరం పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వ పరీక్షల విభాగానికి జాబితాను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
కరోనా (covid effect) దృష్ట్యా పదో తరగతి పరీక్షలను (Tenth results) ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల (Tenth results) వెల్లడికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70శాతం, ఇతర 30 మార్కులకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 50 మార్కుల సగటు తీసుకోగా.. దీనిలో 70శాతం అంటే 35 మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. రాత పరీక్ష 20 మార్కులను 35కు తీసుకువస్తారు.