ఎంసెట్ ఫలితాల్లో తమ కుమారుడికి మొదటి ర్యాంకు సాధించడంతో సాయితేజ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ సైన్స్‌లో ఇంజినీర్ కావాలని ఉందని ముంబైలో సీఎస్ఈ తీసుకుంటున్నట్లు మెుదటి ర్యాంకర్ సాయితేజ్ తెలిపారు.
ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్ - తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తాజావార్తలు
ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయనగరం జిల్లాకు చెందిన సాయితేజ్ మొదటి ర్యాంక్ సాధించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని వెల్లడించారు.
ఎంసెట్‌లో ఏపీ విద్యార్థికి మొదటి ర్యాంక్
నారాయణ కళాశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో మంచి ఫలితం సాధించానని పేర్కొన్నారు. తల్లిదండ్రులు విజయనగరంలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని వివరించారు.
ఇవీచూడండి:ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల