ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో.. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. గవర్నర్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన ఎస్‌ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్‌కు వివరించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ - sec meet with governor breaking
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు.
![ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ AP: sec meeting with governor on local body elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9577816-545-9577816-1605680687913.jpg)
ఏపీ: స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ
ఎన్నికల నిర్వహణ కోసం.. ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం.. రమేశ్ కుమార్ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. కాసేపట్లో జిల్లా అధికారులతో ఎస్ ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలపై.. వీడియో కాన్ఫరెన్స్ లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:మీసేవల ముందు పడిగాపులు... క్యూలైన్లలో పడరాని పాట్లు