దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని హర్ కీ పౌరి ఘాట్‌లో వందలాది మంది భక్తులు గంగ స్నానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పున్నాల గౌరీశంకర్ అనే వ్యక్తి హరిద్వార్‌ను సందర్శించారు. పౌరి ఘాట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, త్రివేంద్ర సింగ్ రావత్‌ల ఫొటోలకు గంగా స్నానం చేయించారు.
గంగాఘాట్‌లో ఆ ముఖ్యమంత్రుల ఫొటోలకు పుణ్యస్నానం
వసంత పంచమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి హరిద్వార్‌లోని హర్ కీ పౌరి ఘాట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఫొటోలకు గంగాస్నానం చేయించి మొక్కులు సమర్పించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
గంగాఘాట్‌లో ఆ ముఖ్యమంత్రుల ఫొటోలకు పుణ్యస్నానం
వసంత పంచమి సందర్భంగా.. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని గంగా, సరస్వతీ అమ్మవార్లను వేడుకున్నట్లు పున్నాల గౌరీశంకర్ తెలిపారు. ఈ రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం దేశం ఆర్థికంగా నష్టాల్లో ఉందని, వీలైనంత త్వరగా ప్రగతిలో భారత్ వేగం పుంజుకోవాలని గౌరీశంకర్ అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సదిశలో నడిపే విధంగా ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని సూచించారు.
- ఇదీ చూడండి :బాసర అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాల సమర్పణ