world record in skating: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన మురళి, సరిత దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె వెన్సిక శిరి.. వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యంగా 250 కిలో మీటర్లు ఏకధాటిగా స్కేటింగ్ పూర్తి చేసింది. వజ్ర వరల్డ్ రికార్డు సీఈవో తిరుపతిరావు, పలమనేరు డీఎస్పీ గంగయ్యల సమక్షంలో ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నంగిలిలో శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఈ స్కేటింగ్ జిల్లాలో నగరి వరకు కొనసాగింది. ఆడపిల్లలను ఎదగనిద్దాం... అమ్మాయి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో.. బేటీ పడావో వంటి నినాదాల ప్లకార్డులను ప్రదర్శించారు.
250 కి.మీ.స్కేటింగ్ పూర్తి చేసిన 8ఏళ్ల బాలిక.. వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యం - తెలంగాణ వార్తలు
world record in skating : ఏపీలోని పుత్తూరు పట్టణానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి.. వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యంగా 250 కిలో మీటర్లు ఏకధాటిగా స్కేటింగ్ పూర్తి చేసింది. ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నంగిలిలో ప్రారంభమైన ఈ స్కేటింగ్ నగరి వరకు కొనసాగింది.
![250 కి.మీ.స్కేటింగ్ పూర్తి చేసిన 8ఏళ్ల బాలిక.. వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యం world record in skating, skating girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14517163-51-14517163-1645329476983.jpg)
వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యం.. 250 కి.మీ.స్కేటింగ్ పూర్తి చేసిన 8ఏళ్ల బాలిక
స్కేటింగ్‌లో వరల్డ్ రికార్డుకు ముందుకొచ్చిన బాలిక సాహసం అభినందనీయమని వజ్ర వరల్డ్ రికార్డు సీఈవో తిరుపతిరావు అన్నారు. నంగిలి, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు బైపాస్‌రోడ్డు, చౌడేపల్లె, సోమల, సదుం, కల్లూరు మీదుగా నగరికి శనివారం రాత్రి గం.10.20కి చేరుకున్న వెన్సికశిరిని స్థానిక ఎమ్మెల్యే రోజా అభినందించారు.
వజ్ర వరల్డ్ రికార్డే లక్ష్యం.. 250 కి.మీ.స్కేటింగ్ పూర్తి చేసిన 8ఏళ్ల బాలిక
ఇదీ చదవండి:folk singer sirisha : ఆమె జానపదానికి.. లక్షల అభిమానులు