AP Minister Appalaraju Followers Protest : ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు పై సీఐ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. విశాఖ శారద పీఠం వద్ద అప్పలరాజు అనుచరులు నినాదాలు చేశారు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..

AP Minister Appalaraju Followers Agitation : మంత్రి సీదిరి అప్పలరాజుకు విశాఖ శారదాపీఠం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా శారదాపీఠానికి మంత్రి తన అనుచరులతో కలిసి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్ద విధుల్లో ఉన్న అరిలోవ సీఐ రామూనాయుడు వారిని అడ్డుకున్నారు. ఒక్కరే లోపలికి వెళ్లండి లేకపోతే బయటకు పొండి అన్నట్లుగా సీఐ అభ్యంతరకర పదజాలంతో దూషించారని మంత్రి ఆరోపించారు. దీనిపై తీవ్ర అవమానం జరిగిందని భావించిన మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.
అక్కడ ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు మంత్రిని సముదాయించేందుకు యత్నించినా ఆయన సమాధానపడలేదు. బూతులు మాట్లాడిన సీఐని పిలిపించి క్షమాపణ చెప్పించాలని కొద్దిసేపు గేటు వద్దే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాను అక్కడ ఉండబోనని మంత్రి వెనుదిరిగారు. ఈ విషయం హోంమంత్రి సుచరితతో తేల్చుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు.. భగ్గుమన్న గులాబీదళం