తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2021, 4:35 PM IST

ETV Bharat / city

Inter results: రేపు ఇంటర్‌ సెకండియర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.

andhra
ఇంటర్‌

ఈ వెబ్‌సైట్లలో ఫలితాలు..

  • examsresults.ap.nic.in, bie.ap.gov.in
  • results.bie.ap.gov.in, results.apcfss.in

ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులిలా..

ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని ఛాయరతన్‌ కమిటీ నిర్ణయించింది. పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్ట్స్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులు, పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్‌ విద్యామండలి కోరింది.

ఇదీ చదవండి:NEW CHARGES FROM TODAY: నేటి నుంచే కొత్త రుసుములు.. ఆస్తుల విలువ పెంపు!

ABOUT THE AUTHOR

...view details