తెలంగాణ

telangana

ETV Bharat / city

Punishment: ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారికి వారం జైలుశిక్ష

హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్‌, ఐఎఫ్​ఎస్​ అధికారులకు జైలు శిక్ష పడింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఇద్దరు ఐఏఎస్‌లకు వారం జైలుశిక్ష
ఇద్దరు ఐఏఎస్‌లకు వారం జైలుశిక్ష

By

Published : Jun 22, 2021, 5:23 PM IST

Updated : Jun 22, 2021, 9:21 PM IST

తీర్పు అమలు చేయలేదని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు వారం పాటు జైలు శిక్ష విధించింది. ఉన్నతాధికారులైన చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌కు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 36 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఇద్దరు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాదనలు విన్న హైకోర్టు.. ఇద్దరికీ వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది.

లిఖితపూర్వక హామీ.. రీకాల్ చేసిన హైకోర్టు

హైకోర్టు ఉత్తర్వులను రేపు సాయంత్రంలోగా అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. లిఖితపూర్వకంగా ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చారు. దీంతో ఇద్దరు ఉన్నతాధికారులకు వేసిన జైలు శిక్షను హైకోర్టు రీకాల్ చేసింది. జైలుశిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని పేర్కొంది.

ఇదీ చదవండి: Cm Kcr: ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి కావాలి..

Last Updated : Jun 22, 2021, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details