విశాఖ జిల్లా వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఏపీ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచివెళ్లొద్దని తెలిపింది.
'ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయండి'
విశాఖ జిల్లా ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఉంచాలని ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని తెలిపింది.
lg polymers
గ్యాస్ లీక్ అయ్యాక మిగిలిన స్టైరిన్‌ను ఎవరి అనుమతితో వెనక్కి తీసుకెళ్లారని.. లాక్‌డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్జీ పాలిమర్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి:అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?