AP HIGH COURT ON SOCIAL MEDIA CASE : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై దూషణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ఆరుగురు నిందితులకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు జలగం వెంకట సత్యనారాయణ, కిషోర్‌కుమార్ రెడ్డి, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్, అజయ్ అమృత్ గౌతమి, అవుతు శ్రీధర్‌రెడ్డికి బెయిల్ వచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేశారు.
హైకోర్టు న్యాయమూర్తులపై దూషణ కేసులో.. నిందితులకు బెయిల్ - తెలంగాణ వార్తలు
AP HIGH COURT ON SOCIAL MEDIA CASE : ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దూషణ కేసులో నిందితులకు ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు జలగం వెంకట సత్యనారాయణ, కిషోర్‌కుమార్ రెడ్డి, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్, అజయ్ అమృత్ గౌతమి, అవుతు శ్రీధర్‌రెడ్డికి బెయిల్ వచ్చింది.
ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు.. తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాల్ని ఆపాదిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2020 ఏప్రిల్ 16 నుంచి జులై 17 వరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీలోని సైబర్ నేరాల విభాగం మొత్తం 12 కేసుల్ని నమోదు చేసింది. వాటిల్లో 16 మందిని నిందితులుగా పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది నవంబరు 11న ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐ చేపట్టింది.
ఇదీ చదవండి:sankranthi kodi pandalu 2022: మీకు తెలుసా.. శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి!