అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సతీమణితో కలిసి.. రాజ్భవన్లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ను గవర్నర్ తీసుకున్నారు. తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల ప్రభావాలు తమకు ఎదురుకాలేదని గవర్నర్ చెప్పారు.
రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ గవర్నర్ - corona vaccine news
ఏపీ గవర్నర్ దంపతులు రాజ్భవన్లో రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.
రెండవ మోతాదు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ గవర్నర్
వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేకాక.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా అవసరమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తమదైన భూమికను పోషించారని అన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్