తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం దేవస్థానం అక్రమాలపై అనిశా విచారణ - శ్రీశైలం కుభంకోణంపై అనిశా విచారణ

ఏపీలోని శ్రీశైల దేవస్థానంలో జరిగిన అక్రమాలపై రాజకీయ దుమారం చెలరేగుతుండటంతో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అనిశా అధికారులు శ్రీశైలం చేరుకొని టికెట్ల అక్రమాలపై విచారణ జరిపి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

srisailam temple
శ్రీశైలం దేవస్థానం అక్రమాలపై అనిశా విచారణ

By

Published : Jun 24, 2020, 1:32 AM IST

ఏపీలోని శ్రీశైల దేవస్థానంలో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ విచారణ చేయనుంది. ఈ కుంభకోణంపై రాజకీయ దుమారం రేగడం వల్ల.. లోతుగా విచారించేందుకు ప్రభుత్వం అనిశాకు బాధ్యతలు అప్పగించింది. రూ.2.56 కోట్ల అవినీతి జరిగిందని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు.

సైబర్ నైపుణ్యం కలిగిన వారితో కుమ్మక్కై.. ఆన్​లైన్ టికెట్లను పక్కదారి పట్టించినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, గుమస్తాలను సస్పెండ్ చేసి వారి నుంచి సొమ్మును రికవరీ చేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అనిశా అధికారులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థానం అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే అనిశా అధికారులు శ్రీశైలం చేరుకొని టికెట్ల అక్రమాలపై విచారణ జరిపి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details