విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను(VISAKHA STEEL PLANT privatization) సవాలు చేస్తూ సీబీఐ(CBI) మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్ అఫిడవిట్ వేశారు. విశాఖ ఉక్కు దేశంలో సముద్ర తీరాన ఉన్న మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని.. ఏపీలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అని పేర్కొన్నారు. 20 వేల మందికిపైగా నేరుగా, అనేక మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అఫిడవిట్‌లో తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పలువురు త్యాగాలు చేశారని 32 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించి ప్రత్యామ్నాయాలను చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్(YS JAGAN) ఈ ఏడాది ఫిబ్రవరి 6న ప్రధాని మోదీకి(PM MODI) లేఖ రాశారని తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమకు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుందన్నారు. పరిశ్రమకు సొంతంగా క్యాప్టివ్ మైనింగ్ గనులు లేకపోవడంతో ఉక్కు ఉత్పత్తికి అధిక ఖర్చు అవుతోందన్నారు. ఆ ప్రభావం లాభాలపై పడుతోందని తెలిపారు. ప్లాంట్‌ను పూర్వస్థితికి తెచ్చేందుకు అవకాశాలను అన్వేషించాలని, పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని.. కేంద్ర పెట్రోలియం సహజవాయువు, ఉక్కుశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి ఫిబ్రవరి 26 న లేఖ రాసినట్లు ఏపీ సర్కార్ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
VISAKHA STEEL PLANT: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి' - తెలంగాణ వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమను(VISAKHA STEEL PLANT) లాభాలబాట పట్టించే ప్రత్యామ్నాయాలను కేంద్రం పునఃపరిశీలన చేయాలని ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో(AP HIGH COURT) అఫిడవిట్ దాఖలు చేసింది. విశాఖ ఉక్కుకు పునరుజ్జీవనం చేసేందుకు పలు సూచనలు చేస్తూ ఏపీ సీఎం జగన్( AP CM JAGAN) కేంద్రానికి 3 లేఖలు రాశారని పేర్కొంది. తమ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించలేదని తెలిపింది. తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరింది.
పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థికమంత్రి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి మార్చి 8న ప్రకటన చేసిన తర్వాత మార్చి 9న ప్రధానికి ఏపీ సీఎం జగన్ మరోలేఖ రాశారని కరికాల వళవన్ అఫిపడవిట్‌లో తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ శాసనసభ ఈ ఏడాది మే 20న తీర్మానం చేసిందన్నారు. ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారం.. ఆయా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్నారు. ఒక్కో కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలని అఫడవిట్‌లో ఏపీ ప్రభుత్వం కోరింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి నెలకు రూ.200 కోట్ల లాభాల్ని ఆర్జించగలుగుతుందని అఫిడవిట్‌లో తెలిపింది.
ఇదీచదవండి:NIAB: ఎన్‌ఐఏబీలో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల.. గెజిట్ జారీ