- నగరం: కడప
సమస్య:కడప నగరాన్ని అయిదు నెలల వ్యవధిలో రెండుసార్లు (AP rain updates 2021) భారీ వర్షాలు ముంచెత్తాయి. జులైలో కురిసిన వర్షంతో రెండు రోజుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నా... తాజా వర్షాలతో నగరం సెలయేరుగా మారింది. దాదాపు 3 వేల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నాయి.
ఏం చేయాలి?:బుగ్గ జలాశయంలోకి సామర్థ్యానికి మించి చేరిన వరదను కిందికి వదిలినప్పుడల్లా నగరంలోని వివిధ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. బుగ్గవంక ప్రవాహం ‘పెన్నా’లో కలిసే క్రమంలో కడప నగర పరిధిలో బుగ్గవంకకు రెండువైపులా రెండు కి.మీ. పొడవునా రక్షణ గోడలు నిర్మిస్తే ముంపు తప్పుతుంది. ఇప్పటికే ఆరు కిలోమీటర్లలో రక్షణ గోడలు నిర్మించారు. మిగిలిన పనుల పూర్తికి ప్రభుత్వం రూ.49 కోట్లు కేటాయించింది. వీటికి టెండర్లు పిలవాల్సి ఉంది. నగరంలో రూ.60 కోట్లతో వరదనీటి కాలువల ప్రతిపాదనలూ కార్యరూపం దాల్చలేదు.
- నగరం: నెల్లూరు
సమస్య:సోమశిల డ్యాం(somasila dam news) గేట్లు ఎత్తినప్పుడల్లా నెల్లూరులోని పెన్నా పరివాహక ప్రాంతాలు ఏడాదిలో రెండుసార్లు ముంపునకు గురవుతున్నాయి. ప్రస్తుతం 12 ప్రాాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. నగర పరిధిలో 14 పంట కాలువలను ఆక్రమించడంతో భారీ వర్షాలు కురిసినపుడల్లా మాగుంట లేఅవుట్, ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురంలో నీరు భారీగా చేరుతోంది.
ఏం చేయాలి?:సమస్య పరిష్కారానికి పెన్నా నది పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలి. ఆక్రమణకు గురైన 14 పంట కాలువలను విస్తరించాలి. గత ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించి ఆక్రమణలు గుర్తించారు. వీటిని తొలగించి బాధితులకు టిడ్కో ఇళ్లు కేటాయించేలా అప్పట్లో ప్రణాళిక రూపొందించినా అమలవలేదు. కాలువల నవీకరణకు 2019లో రూ.60 కోట్లు కేటాయించారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి.
- నగరం: తిరుపతి
సమస్య:భారీ వర్షాలతో తిరుపతి నగరం ఈ ఏడాది (heavy rains in ap) రెండుసార్లు జలమయమైంది. ప్రస్తుత వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మల్వాడి గుండం, కపిలతీర్థం నుంచి వచ్చే వర్షపు నీటితో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు ముంపు బారిన పడటం రివాజుగా మారింది.