ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 10 మంది మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. కరోనాతో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు.
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే పదివేలకు చేరువలో కేసులు - తెలంగాణ వార్తలు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,716మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 10 మంది మృతి చెందారు.
ఏపీ కరోనా కేసులు, ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 3,359 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 60,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో 24 గంటల్లో 39,619 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.