ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం వద్ద బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రానికి వెళ్తారు. గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.
AP CM Jagan: నేటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం వద్ద బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వ్యవసాయక్షేత్రానికి వెళ్తారు.
ఏపీ సీఎం జగన్, జగన్ పర్యటన
స్థానిక నాయకులతో సమావేశమైన అనంతరం... తిరిగి అమరావతికి బయలుదేరుతారు. జగన్ బస చేయబోయే అతిథి గృహం, హెలిప్యాడ్ వద్ద కడప కలెక్టర్ విజయరామరావురాజు, ఎస్పీ అన్బురాజన్ భద్రత, ఇతర ఏర్పాట్లును పరిశీలించారు. విజయమ్మ, షర్మిల ఇడుపులపాయకు రావటం అనుమానమేనని పార్టీ వర్గాలు అంటున్నారు. సెప్టెంబర్ 2నే.. హైదరాబాద్‌లోని లోటస్‌పాండులో వైఎస్ సన్నిహితులతో షర్మిళ, విజయమ్మ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:KRMB: కొద్దిసేపట్లో కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ.. సర్వత్రా ఉత్కంఠ