AP Crop damage Compensation : ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారమనిస్తున్నామని.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్నారు. గతేడాది నవంబర్‌లో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు.. ఇన్‌పుట్ సబ్సిడీ జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 5 లక్షల 97 వేల 311 మంది రైతులకు.. రూ.542.06 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. రైతులకు అన్నివిధాలుగా తోడు, నీడగా నిలబడుతున్నామన్నారు.
"ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం. 2021 నవంబర్‌లో వర్షాలు, వరదలకు పంట నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద సహాయం. నేల కోత, ఇసుక మేటల కారణంగా రైతులు నష్టపోయారు. 5,97,311 మంది రైతులకు రూ.542 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. 1,220 రైతు గ్రూపులకు పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధి. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధి. ఇవాళ రూ.571 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత ఖరీఫ్‌లో రూ.1800 కోట్లు బీమా కింద ఇచ్చాం. వివిధ కారణాలతో రూ.93 కోట్లు ఇవ్వలేకపోయాం. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఇవాళ రూ.93 కోట్లు ఇస్తున్నాం."