తెలంగాణ

telangana

ETV Bharat / city

Notification on Amravati Corporation‌: మళ్లీ తెరపైకి అమరావతి కార్పొరేషన్‌.. 19 గ్రామాలతో ఏర్పాటుకు ఉత్తర్వులు

AP Govt Notification on Amravati Corporation‌: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అమరావతి ఐకాస నేతలు మాత్రం సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న 29 రాజధాని గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Notification on Amravati Corporation‌,  AP capital Amaravati as a corporation go issued by guntur collector
మళ్లీ తెరపైకి అమరావతి కార్పొరేషన్‌

By

Published : Jan 4, 2022, 10:22 AM IST

మళ్లీ తెరపైకి అమరావతి కార్పొరేషన్‌

AP Govt Notification on Amravati Corporation‌: ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఈ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, ఉద్ధండరాయినిపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం, ఐనవోలు, శాఖమూరు, నేలపాడు, దొండపాడు, రాయపూడి, తుళ్లూరు, మంగళగిరి మండలంలోని కురుగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం ఈ కార్పోరేషన్ పరిధిలోకి వస్తాయి. ఆయాచోట్ల గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ నోటిఫికేషన్‌లో సూచించడంతో... ఆ మేరకు అన్ని గ్రామపంచాయతీలకు సమాచారం ఇచ్చినట్లు తుళ్లూరు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.

AP capital Amaravati as a corporation go issued by guntur collector: సీఆర్డీఏ చట్టంలో 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతంగా పేర్కొనగా.. మంగళగిరి మండలంలోని నవులూరు, బేతపూడి, నిడమర్రు, ఎర్రబాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలు తాజా నోటిఫికేషన్​లో చూపలేదు. వీటిని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో కలుపుతూ 6నెలల కిందటే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టానికి భిన్నంగా, అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం కలిగించేలా నోటిఫికేషన్ జారీ చేసిందని రాజధాని ఐకాస నేతలు తప్పుపడుతున్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోకి కొన్ని గ్రామాలను తీసుకెళ్లటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆందోళనలు, నిరసనలతో పోరాటం సాగిస్తున్న అమరావతి రైతులు... ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై మండిపడుతున్నారు. ఈపరిస్థితుల్లో గ్రామసభల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి:CM KCR Comments on Lockdown: లాక్​డౌన్​ లేదు కానీ.. 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు..

ABOUT THE AUTHOR

...view details