కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీలు కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేసినట్లు ఎంపీలు జయదేవ్, కనకమేడల వెల్లడించారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, ఎస్ఈసీ, న్యాయవ్యవస్థపై దాడులు వంటి పలు అంశాలను ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోంశాఖకు తెదేపా ఫిర్యాదు - తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల తెలిపారు. ఆలయాలపై దాడులు, శాంతిభద్రతల విఘాతం, దాడులు వంటి పలు అంశాలను వివరించినట్టు చెప్పారు.
శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు
ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరపాలని లేఖలో కోరినట్లు తెదేపా ఎంపీలు వెల్లడించారు.
ఇవీ చూడండి:ముగిసిన పంచాయతీ తొలిదశ పోలింగ్.. ప్రారంభమైన కౌంటింగ్