ఏపీ విశాఖలోని ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్ఓ ధ్రువీకరణ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విధమైన ధ్రువీకరణ రావడంతో కళాశాల తన ప్రత్యేకతను చాటి చెప్పినట్లయింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్ధ.. వివిధ అంశాల అధారంగా జారీ చేసింది.
ISO CERTIFICATION: విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్ఓ ధ్రువీకరణ - కలెక్టర్ డాక్టర్. మల్లిఖార్జున
ఏపీ విశాఖలోని ఆంధ్రా వైద్య కళాశాలకు ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్ఓ ధ్రువీకరణ లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ వివిధ అంశాల ఆధారంగా దీనిని అందించింది.
నిర్వహణ పద్ధతులు, సంస్థ యాజమాన్యంలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధారంగా దీనిని అందజేస్తారు. ఈ మేరకు ఆ సంస్ధ ప్రతినిధి ఎ.శివయ్య ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పీవీ. సుధాకర్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్. మల్లిఖార్జున సమక్షంలో అందజేశారు. ఉత్తమ పద్ధతులను అనుసరించి వైద్య విద్యా సంస్థను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అభినందనలు తెలిపారు.
ఇదీచూడండి:gandhi hospital case: 'గాంధీ ఆస్పత్రి ఘటన కేసును 2 రోజుల్లో ఛేదిస్తాం'