తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రవాసాంధ్రుల కోసం ఖతార్ నుంచి ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన ఆంధ్ర కళావేదిక - ఆంధ్ర కళా వేదిక వార్తలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖతార్​లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు ఆంధ్ర కళా వేదిక చేయూతనందించింది. వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసింది. వీసా గుడువు ముగిసి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం సహకారంతో ఉచిత క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసింది.

andhra kala vedika
andhra kala vedika

By

Published : Jul 13, 2020, 2:06 PM IST

కరోనా విజృంభిస్తోన్న వేళ దోహా, ఖతార్​లో ఉన్న తెలుగువారిని సొంత ప్రాంతాలకు చేర్చడానికి ఆంధ్ర కళావేదిక విశేష కృషి చేసింది. భారత్​కు వచ్చేందుకు వందే భారత్​ మిషన్​లో నమోదు చేసుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. అలాంటి వారందరిని ఏపీలోని స్వగ్రామాలకు చేర్చడానికి ఛార్టెడ్ ఫ్లైట్ నడపడానికి ఆంధ్ర తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి.

ఆంధ్ర కళా వేదిక, తెలుగు కళా సమితి సంయుక్తంగా ఐసీబీఎఫ్​ ఖతార్​, భారతీయ దౌత్య కార్యాలయం, ఏపీ ప్రభుత్వం, ఏపీఎన్​ఆర్​టీ సహకారంతో ఈ ఛార్టెడ్ ఫ్లైడ్ ఏర్పాటు చేశారు.

లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి అక్కడ చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్ర కళా వేదిక చేయూతను అందించింది. స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ఏపీ ప్రభుత్వ సాయంతో ఉచిత క్వారంటైన్​ను ఏర్పాటు చేసింది. ఈ విషయంపై భారత దౌత్య కార్యాలయం, ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు చేసిన ఐసీబీఎఫ్ ప్రధాన కార్యదర్శి మహేశ్ గౌడ, ఐబీపీసీ అధ్యక్షుడు అజీమ్ అబ్బాస్, సీనియర్ కమ్యూనిటీ లీడర్ కె.ప్రసాద్​కు ఆంధ్ర కళా వేదిక కృతజ్ఞతలు తెలిపింది.

ప్రవాసాంధ్రుల కోసం ఖతార్ నుంచి ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన ఆంధ్ర కళావేదిక

ఇదీ చదవండి:హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ABOUT THE AUTHOR

...view details