ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు (10th class results) విడుదల కానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in, www.eenadu.net వెబ్సైట్ల ద్వారా చూసుకోవచ్చు. 2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. షార్ట్ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలనూ మంత్రి నేడు ప్రకటిస్తారు. కరోనా కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకపోవండతో.. అప్పుడు కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు అందుకున్న విద్యార్థులకు సైతం ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను విడుదల చేయనున్నారు.
మార్కుల కేటాయింపు ఇలా..
కరోనా (covid effect) దృష్ట్యా పదో తరగతి పరీక్షలను (10th class results) ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల వెల్లడికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మేటివ్ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70 శాతం, ఇతర 30 మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు 10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 50 మార్కుల సగటు తీసుకోగా.. దీనిలో 70 శాతం అంటే 35 మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. రాత పరీక్ష 20 మార్కులను 35కు తీసుకువస్తారు.
ఉదాహరణ: