పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను బుల్లితెర వ్యాఖ్యత సుమకనకాల మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఛాంబర్లో భేటీ అయిన సుమ... కేటీఆర్‌తో పలు విషయాలపై ముచ్చటించారు. మంత్రి కేటీఆర్‌ని కలవటం తనకు ఆనందంగా ఉందని... సుమ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ... ఎందుకంటే...? - ghmc election campaign
మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సుమ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మొదలైన నేపథ్యంలో కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ కావటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
anchor suma kanakala met minister ktr
టెలివిజన్ కార్యక్రమాల్లో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే తాను... కేటీఆర్ మాటలు వినటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హామీలివ్వటమే కాదు అమలు చేయడం, చెప్పినమాటకు కట్టుబడి ఉండటం అభినందనీయమని సుమ కొనియాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైన నేపథ్యంలో వీరి భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.