తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప నిజమేంటో చెప్పలేం: ఎస్పీ ఫకీరప్ప - sp on gorantla video

SP on MP Nude Video: ఏపీలో సంచలనం రేకెత్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు బుధవారం వెల్లడించారు.

sp on gorantla video
sp on gorantla video

By

Published : Aug 10, 2022, 5:59 PM IST

Updated : Aug 10, 2022, 6:48 PM IST

SP on MP Nude Video: ఏపీలో సంచలనం రేకెత్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు బుధవారం వెల్లడించారు.

"వీడియో కాల్‌ విషయంపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన కేసు నమోదు చేశాం. అనంతరం చేపట్టిన దర్యాప్తులో భాగంగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రివేళ 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో మొదటగా.. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ వీడియో షేర్ చేసినట్టు గుర్తించాం. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వొడాఫోన్‌ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు. ఒకరు మొబైల్‌లో చూస్తున్నప్పుడు.. దాన్ని మరొకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్‌ చేశారు. రీ-పోస్టు చేశారు. ఐ -టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో తొలిసారి పోస్టు చేసింది కూడా.. ఫార్వర్డ్‌ చేసిన వీడియోనే. అది ఒరిజినల్‌ వీడియో కాదు కాబట్టి.. అది మార్ఫింగ్‌ చేశారా? లేదా? అనేది తేల్చలేకపోతున్నాం.

ఒరిజినల్‌ వీడియో దొరికే వరకు.. దాన్ని మొదట పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు.. ఈ విషయాన్ని నిర్ధారించలేము. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే.. అది మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేం. సోషల్‌ మీడియాలో చూస్తున్న వీడియో ఒరిజినల్‌ కాదు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం. వీడియోను యూకేలో ఎడిటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్‌ వీడియో ఎవరి వద్దైనా ఉంటే.. బాధితులు ఎవరైనా ముందుకొచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ నివేదిక వస్తుంది" అని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.

పరువునష్టం దావా వేస్తా: గోరంట్ల మాధవ్‌
పోలీసులు వివరాలు వెల్లడించిన తర్వాత.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పందించారు. అది వందశాతం ఫేక్‌ వీడియో అని గతంలోనే చెప్పానని అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తనకు ముందే తెలుసన్నారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియో సృష్టించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.. పరువునష్టం దావా వేస్తానని ఎంపీ అన్నారు.

ఇవీ చదవండి:EAMCET Results 2022: ఎల్లుండి ఎంసెట్​ ఫలితాల విడుదల..!

దళిత అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్​రేప్​.. షాపింగ్​కు వెళ్లి వస్తుండగా తోటలోకి లాక్కెళ్లి..

Last Updated : Aug 10, 2022, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details