తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandayya: ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి - నెల్లూరు వార్తలు

ఆనందయ్య రూపొందించిన కరోనా మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తి చేసింది. నివేదికను ఆన్​లైన్​ ద్యారా పంపారు. మలి దశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.

anandayya medicine news
anandayya medicine news

By

Published : May 26, 2021, 6:28 PM IST

ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తైంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీ ని ఆయుర్వేద వైద్యులు పూర్తిచేశారు. ఈ పరిశోధనల నివేదికను ఆన్‌లైన్‌లో సీసీఆర్ఏఎస్‌కు.. అధికారులు అందజేశారు. ఇందుకోసం మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.

రోగులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్​పై ఆయుర్వేద అధికారులు వివరాలు వెల్లడించలేదు. రేపటిలోగా సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు జారీ చేయనుందని భావిస్తున్నారు. ఆదేశాలు అందిన వెంటనే తర్వాత దశ ప్రయోగాలు ప్రారంభించి... టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:కరోనా 'ల్యాబ్​ లీక్'​పై డబ్ల్యూహెచ్ఓ మరోసారి దర్యాప్తు!

ABOUT THE AUTHOR

...view details