తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandaiah on monkeypox : 'మంకీపాక్స్‌కూ మందు తయారు చేస్తా' - విశాఖలో ఆనందయ్య కీలక ప్రకటన

Anandaiah on monkeypox: కరోనాకు మందు తయారు చేశానని చెప్పిన ఆనందయ్య.. ఇప్పుడు మంకీ పాక్స్‌కూ మందు తయారు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకృతి వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందన్నారు. వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానని ఆయన వెల్లడించారు.

Anandaiah on monkeypox
'మంకీపాక్స్‌కూ మందు తయారు చేస్తా'

By

Published : Aug 9, 2022, 12:39 PM IST

'మంకీపాక్స్‌కూ మందు తయారు చేస్తా'

Anandaiah on monkeypox: కరోనా నివారణకు మందు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆనందయ్య.. మంకీ పాక్స్​కూ మందు తయారు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వైద్యంలో ప్రతి వ్యాధికి మందు ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క మంకీ పాక్స్ రోగి కూడా తన వద్దకు రాలేదని.. వచ్చినట్లయితే వ్యాధి లక్షణాలను బట్టి మందు తయారు చేస్తానని వెల్లడించారు. మంకీ పాక్స్ పట్ల ప్రజలు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని.. ఎవరికైనా వ్యాధి సోకినట్లయితే తన వద్దకు వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details