వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడనని అన్నారు.
వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం - ఏపీ వార్తలు
ఏపీలోని నెల్లూరు జిల్లా అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర వేడుకలకు ఆహ్వానించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం
అధికారుల తీరుపై తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపకపోవడం దారుణమన్నారు.