తెలంగాణ

telangana

ETV Bharat / city

అసలే క్యాన్సర్.. ఆపై కరోనా.. బెడ్లు లేవు పొమ్మన్నారు! - nellore distrct kaluvai latest news

ఆమె క్యాన్సర్​తో కొంతకాలంగా బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చింది. బెడ్లు ఖాళీలేవని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అసలే క్యాన్సర్.. ఆపై కరోనా.. ఏంచేయాలో ఆమెకు అర్థంకాలేదు. అన్నదమ్ములకు ఫోన్ చేస్తే ఇంటికి రావద్దు.. తామే వస్తాం అన్నారు. చేసేది లేక ఊరి చివర పొలాల్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చికిత్స లేక రెండు రోజుల పాటు బాధితురాలు నరకం చూసింది.

అసలే క్యాన్సర్.. ఆపై కరోనా.. బెడ్లు లేవు పొమ్మన్నారు!
అసలే క్యాన్సర్.. ఆపై కరోనా.. బెడ్లు లేవు పొమ్మన్నారు!

By

Published : Jul 20, 2020, 7:24 PM IST

కడప జిల్లాకు చెందిన ఓ మహిళ కొద్ది రోజులుగా క్యాన్సర్​తో బాధపడుతోంది. చికిత్స కోసం నెల్లూరు జిల్లా క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లుగానే కొవిడ్ పరీక్ష చేయించుకొగా.. పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా కేంద్రంలో బెడ్లు లేవని బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు.

చేసేది లేక కలవాయి మండలంలోని రామన్న గారిపాలెంలో ఉంటున్న అన్నదమ్ముల ఇంటికి వెళ్లాలనుకుంది. ఈ విషయాన్ని వారికి ఫోన్ చేసి చెప్పింది. కరోనా సోకిన కారణంగా తోడబుట్టిన వారు ఇంటికి తీసుకువెళ్లలేకపోయారు. చేసేది లేక అక్కడే పొలాల్లో ఒంటరిగా ఉండిపోయింది. తన సోదరిని అలా ఒంటరిగా వదిలేయ లేకపోయారు ఆ అన్నదమ్ములు . రాత్రుళ్లు తన సోదరి ఉంటున్న చోటు నుంచి కాస్త దూరంలో ఆమెకు తోడుగా కాపలాకాశారు. ఇలా రెండ్రోజలు పాటు ఆ మహిళ చికిత్స అందక నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు రెండు రోజుల తరువాత స్పందించిన సిబ్బంది అంబులెన్స్​ను పంపించారు.

బాధితురాలిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. దీంతో అన్నదమ్ములు ఊపిరిపీల్చుకున్నారు. కష్టం వస్తే ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కన్నీరుపెట్టుకున్నారు.

అసలే క్యాన్సర్.. ఆపై కరోనా.. బెడ్లు లేవు పొమ్మన్నారు!

ఇవీ చూడండి:

కరోనా కన్నీళ్లు: చనిపోయిన ఆరురోజుల తర్వాత అంత్యక్రియలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details