తెలంగాణ

telangana

ETV Bharat / city

Hen: గుడ్డు పెట్టి.. పిల్లల్ని పొదిగిన కోడిపుంజు - hen lays eggs in Peddakannali

కోడిపుంజు మరో కోడిపుంజుతో తిరుగటాన్ని ఎప్పుడైన చూశారా? పోనీ కోడిపుంజు గుడ్డు పెట్టడం? ప్రకృతి విర్ధుమైన మాటలు చెప్పకండి అంటారా.. కానీ ఇవి జరిగాయి. అవును మీరు విన్నది నిజమేనండీ.. ఓ కోడిపుంజు మరో కోడిపుంజుతో జతకట్టి ఏకంగా 11 గుడ్లు పెట్టింది.

cock_
కోడిపుంజు

By

Published : Aug 5, 2021, 5:35 PM IST

ఏపీ చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్టీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఇంట్లో ప్రతిరోజు కూతకూసి నిద్రలేపే కోడిపుంజు మరో కోడిపుంజుతో తిరుగుతుండటాన్ని యజమాని గమనించాడు. కొద్దిరోజులకే కోడిపుంజు గుడ్డు పెట్టడాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. వరుసగా 11 గుడ్లు పెట్టింది. గుడ్లు పొదిగి 5 పిల్లలను చేసి సంరక్షిస్తోంది. స్థానిక పశువైద్యాధికారి నారాయణను వివరణ కోరగా ఒక్కోసారి జన్యులోపం వల్ల ఇలా జరుగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details