AMUL plant: పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతి గాంచిన అమూల్ సంస్థ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మొదటి దశలో 300 కోట్లు, రెండో దశలో 200 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలి ప్లాంట్‌ను రోజుకు ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. భవిష్యత్తులో దీన్ని పదిలక్షల లీటర్లకు పెంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.
మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ రైతుల నుంచే సేకరిస్తాం..
ప్లాంటు నిర్మాణంతో పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, స్వీట్స్ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు బ్రెడ్, బిస్కెట్, బేకరీ పదార్ధాలు కూడా ఉత్పత్తి చేయనుంది. రానున్న 18 నుంచి 24 నెలలలోపు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు అమూల్ సంస్థ తెలిపింది. ప్లాంటు ఏర్పాటుతో 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని అమూల్ కంపెనీ హామీ ఇచ్చింది.
ప్రభుత్వంతో అమూల్ సంస్థ ఒప్పందం.. రాష్ట్రంలో మరో శ్వేతవిప్లవం..
ktr on amul: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్న ఆయన... ప్రత్యేకించి వ్యవసాయరంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలతో రాష్ట్రంలో పాడిరంగం భారీగా అభివృద్ధి చెందిందన్న కేటీఆర్... తెలంగాణలో మరో శ్వేతవిప్లవం ప్రారంభమైందన్నారు. పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడిపరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
దక్షిణ భారతదేశంలోనే ఆమూల్ తొలి డెయిరీ ప్లాంట్..
దేశ పాడిపరిశ్రమ రూపురేఖలు మార్చి ప్రపంచానికి గొప్ప పాఠాలు చెప్పిన అమూల్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తుండడంపై కంపెనీకి అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: